ఆర్గానిక్ ఫుడ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తాం - ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా
APEDB
Ramakrishna

ఆర్గానిక్ ఫుడ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తాం - ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా

21-10-2017

ఆర్గానిక్ ఫుడ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తాం - ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా

ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం ఏవైనా ప్రోత్సాహకాలు కల్పించగలదా? అని ‘టేస్టీబైట్ ఈటబుల్స్ లిమిటెడ్’ సంస్థ చైర్మన్ అశోక్ వాసుదేవన్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించగా.. తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని, రాష్ట్రానికి వచ్చి పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. 

అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా ఉన్న మాగ్నా ఇంటర్నేషనల్ ఏపీకి వచ్చి వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్ పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని మాగ్నా ఇంటర్నేషనల్ సీటీవో స్వామి కోటగిరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి బదులిచ్చారు. ప్రపంచం ప్రస్తుతం ఎలక్ర్టిక్ వాహనాలకు మళ్లే దిశగా వెళ్తోందని, ఈ పరిణామానికి ఆంధ్రప్రదేశ్ తప్పకుండా మార్గదర్శిగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పలు వాణిజ్య, వ్యవసాయ, ఆహార సంస్థల ప్రతినిధులు వ్యక్తం చేసిన సందేహాలను ముఖ్యమంత్రి నివృత్తి చేశారు. 

ఏపీ హ్యాపెనింగ్ స్టేట్ -అరవింద్ పనగారియా
భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ‘హ్యాపెనింగ్ స్టేట్’గా ఉందని నీతిఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పనగారియా మాట్లాడుతూ తాను నీతిఆయోగ్ ఉపాధ్యక్షునిగా పనిచేసిన కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగిందని అన్నారు. 

Click here for Event Gallery