ఆసియా పర్యటనకు బయలుదేరనున్న ట్రంప్‌

ఆసియా పర్యటనకు బయలుదేరనున్న ట్రంప్‌

21-10-2017

ఆసియా పర్యటనకు బయలుదేరనున్న ట్రంప్‌

అమెరికాను బూడిద చేస్తానంటూ అణు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న కింగ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రవర్తన పట్ల అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. కిమ్‌ను నియంత్రించే మార్గాల కోసం అన్వేషిస్తోంది. హెచ్చరించినా కిమ్‌ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో అమెరికా ఉన్నాతాధికారులు ఆందోళన చెందుతున్నారు. దౌత్యపరమైన చర్చలు కొనసాగిద్దామని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కిమ్‌ను దారిలోపెట్టేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ కీలక అడుగు వేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ఆసియా పర్యటనకు వస్తున్న ఆయన చైనా, జపాన్‌, దక్షిణకొరియా, వియత్నాం, ఫిలిప్పైన్స్‌ దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉత్తరకొరియాను నియంత్రించేందుకు చైనాపై ఆయన ఒత్తిడి తీసుకురానున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్‌ అధికారులు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తరకొరియాతో ఉన్న వివాదాన్ని చైనా తగ్గించగలదని భావిస్తున్న ట్రంప్‌ పర్యటన ప్రాధాన్యత ఇదేనని సృష్టమవుతోంది. నవంబర్‌ 3న ఆయన పర్యటన ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.