వాషింగ్టన్‌లో వైభవంగా జిడబ్ల్యుటిసిఎస్‌ దీపావళి వేడుకలు

వాషింగ్టన్‌లో వైభవంగా జిడబ్ల్యుటిసిఎస్‌ దీపావళి వేడుకలు

25-10-2017

వాషింగ్టన్‌లో వైభవంగా జిడబ్ల్యుటిసిఎస్‌ దీపావళి వేడుకలు

బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటిసిఎస్‌) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. సంస్థ అధ్యక్షుడు దంగేటి కిషోర్‌ స్వాగతోపన్యాసం చేసి సభికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వర్జీనియా, మేరీల్యాండ్‌, డీసీ రాష్ట్రాల నుండి 1200కు పైగా ప్రవాసులు హాజరయిన ఈ కార్యక్రమంలో ఆరు గంటల పాటు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనన్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో 200కు పైగా కళాకారులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో రక్తి కట్టించారు. చదరంగం, చిత్రలేఖనం పోటీల్లో స్థానిక ప్రవాస చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ ముఖ్య అతిధిగా ఈ వేడుకలకు హాజరయ్యారు. యాజిన్‌-సాహితీల సంగీత విభావరి అలరించింది. సంస్థ కార్యవర్గం అధ్యక్షుడు కిషోర్‌ దంపతులను, పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లా సుబ్బారావు, భోజనదాత రాంచౌదరి ఉప్పుటూరిలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. సుధా పాలడుగు, తనుజ గుడిసేవ, చంద్ర మలవతు, అనిల్‌ ఉప్పలపాటి, సురేష్‌ మారెళ్ళ, కృష్ణ లామ్‌, రాకేశ్‌ బత్తినేని, లాక్స్‌ చేపురి, శ్రీధర్‌ మారం, రామకృష్ణ చలసాని, సురేష్‌ మారెళ్ళ, అశోక్‌ వాసం, కవిత బాల, కృష్ణ లామ్‌, కిరణ్‌ అమిరినేని, నాగ్‌ నెల్లూరి, అవినాష్‌ కాసా, కృష్ణ గుడిపాటి, రవి అడుసుమిల్లి, విజయ్‌ అట్లూరి, ప్రవీణ్‌ దాసరి, కార్తీక్‌ నాదెళ్ల తదితరులతో కూడిన కార్యవర్గాన్ని నూతన అధ్యక్షుడు మన్నె సత్యనారాయణ సభకు పరిచయం చేశారు.


Click here for Event Gallery