ఆంధ్రాలో విత్తనాలపై అయోవాలో సమావేశం

ఆంధ్రాలో విత్తనాలపై అయోవాలో సమావేశం

25-10-2017

ఆంధ్రాలో విత్తనాలపై అయోవాలో సమావేశం

కర్నూలు జిల్లాలో ఇటీవల శంకుస్థాపన జరిగిన మెగా విత్తన పార్క్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇటీవల అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు పర్యటించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఈ పార్క్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అయోవా విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమయ్యారు. అవగాహన ఒప్పందానికి అనుగుణంగా తదుపరి చేపట్టాల్సిన కార్యయోజనపై సమాలోచనలు జరిపారు.ఈ పార్క్‌ ఏర్పాటులో భాగస్వాములు, వారు నిర్వహించాల్సిన పాత్రపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో అయోవా విశ్వవిద్యాలయానికి చెందిన దామోదర్‌ నాయుడు, దిలీప్‌ కుమార్‌, అక్కడి వ్యవసాయ శాఖ మంత్రి బిల్‌ నోర్తే, ఉప ముఖ్యమంత్రి మైఖెల్‌ నైగ్‌ పాల్గొన్నారు. వ్యవసాయ కమిషనర్‌ హరి జవహర్‌ లాల్‌ కూడా పాల్గొన్నారు.