చికాగోలో దీపావళి, దసరా సంబరాలు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

చికాగోలో దీపావళి, దసరా సంబరాలు

03-11-2017

చికాగోలో దీపావళి, దసరా సంబరాలు

ట్రై స్టేట్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) ఆద్వర్యంలో దసరా, దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చికాగో నగరంలోని లెమాంట్‌ హిందూ టెంపుల్‌ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీఏ బోర్డు సభ్యులు వందేమాతరం ఆలపించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రమ్యరవి బృందం చేసిన చక్కని పుష్పాంజలి నాట్యం సభికులను అలరించింది.

పూనమ్‌ మహేష్‌, శ్యామ్‌ జిత్‌, సంధ్య రాధాకృష్ణన్‌ బృందాలు, వరణ్‌ వాసిరెడ్డి, రీనా రాకర్స్‌ బృందం, లాస్య ఇషా సుబ్రహ్మణ్యం, రష్మీ, పావనీ, జ్యోతి, తారానా డ్యాన్స్‌ అకాడమీ వారి కథక్‌ నృత్యం, జెలెవా మిచెల్లీ బృందం, ప్రసనన కందూరి బృందం, కేరళ డ్రమ్స్‌ బృందం, అనుపమ చంద్రశేఖర్‌ టీం, అనికా అయ్యలరాజు, ప్రియాంక రిత్విక్‌, రోషిణి, శిల్ప, శ్రియ, మౌనిక కౌషిక, షీలా, రిషిత, నందిత, నిషిత, భాగ్య నగేష్‌ టీమ్‌, స్వప్న చిల్ల టీమ్‌, డేజ్లింగ్‌ దివాస తదితరులు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూఆడిపాడి సంతోషంగా ఈ ఉత్సవాలను జరుపుకొన్నారు. చివరిగా జాతీయ గీతంతో ఉత్సవాలు ముగిశాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన అపర్ణ అయ్యల రాజు, నీలిమ మైలవరపు, రాధిక గరిమెళ్ల వైదేహి సీరం, హేమంత్‌ పప్పు, ప్రసాద్‌ మరువాడ, శ్రీనాథ్‌ వాసిరెడ్డి, స్వప్న పులా, రాణి మాకినేని, దీప్తి చిరువూరి, చాందిని దువ్వూరి తదితరులకు టీటీఏ బోర్డు ధన్యవాదాలు తెలియజేసింది.

Click here for Event Gallery