టిఫాస్‌ దీపావళి వేడుకల్లో తారల కోలాహలం

టిఫాస్‌ దీపావళి వేడుకల్లో తారల కోలాహలం

08-11-2017

టిఫాస్‌ దీపావళి వేడుకల్లో తారల కోలాహలం

న్యూజెర్సిలో దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. తెలుగు కళాసమితి, న్యూజెర్సి (టిఫాస్‌) ఆధ్వర్యంలో నవంబర్‌ 5వ తేదీన స్థానిక నార్త్‌ బ్రన్స్‌విక్‌ హైస్కూల్‌లో జరిగిన వేడుకలకు ఎంతోమంది ప్రముఖులు, కళాకారులు టిఫాస్‌ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో హీరోయిన్‌ రెజీనాతోపాటు కమెడియన్‌ అలీ కూడా పాల్గొన్నారు. లాస్య, జ్యోత్న, యామిని తదితరులు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. గాయనీ గాయకులు ఉమనేహ, దీపు పాడిన పాటలు అందరినీ మైమరపింపజేశాయి. ఆరాధ్యుల కోటేశ్వరరావు ఏకపాత్రాభినయం, మంజుల కోకిల, మాస్టర్‌ శ్రీవత్స మైండ్‌ పవర్‌, ఆధ్యాత్మిక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

న్యూజెర్సిలోని పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన హాస్యనాటిక అందరినీ నవ్వించింది. లిటిల్‌ మ్యూజిషియన్స్‌ అకాడమీ పిల్లలు దీపావళి పాటలను పాడారు. మువ్వల సవ్వడి బృందం అష్టలక్ష్మీ స్తోత్రం డ్యాన్స్‌ను ప్రదర్శించింది. టిఫాస్‌ యూత్‌, స్థానిక కళాకారులు కలిసి ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. చివరన అలీ చేసిన కామెడి షో అందరినీ మనసారా నవ్వించింది. ఫ్యాషన్‌ సెలబ్రిటీ షోలో రెజీనా, యామిని భాస్కర్‌, శ్రావణి, జ్యోత్న శర్మ పాల్గొన్నారు. టిఫాస్‌ ప్రెసిడెంట్‌ గురు ఆలంపల్లి, వైస్‌ ప్రెసిడెంట్‌ మధు అన్న, సెక్రటరీ శ్రీదేవి జాగర్లమూడి, ఈవెంట్స్‌ చైర్‌పర్సన్‌ రేణు తాడేపల్లి, ఇందిర వంగల, సత్యనేమన, రంగ, శ్రీనివాస్‌ భర్తవరపు తదితరులు ఈ వేడుక విజయవంతానికి కృషి చేశారు.

Click here for Event Gallery