గందరగోళం సృష్టించిన డొనాల్డ్‌ ట్రంప్‌

గందరగోళం సృష్టించిన డొనాల్డ్‌ ట్రంప్‌

13-11-2017

గందరగోళం సృష్టించిన డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్షులంటే ఎంతో హుందాగా, ప్రొటోకాల్స్‌ను కచ్చితంగా పాటించే వారుగా పేరు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి మాత్రం ఇవేవీ పట్టవు. ఎక్కడికెళ్లినా తన తీరు తనదే. గతంలో ఓ పెద్ద వ్యాపారవేత్తగా ఉన్న ట్రంప్‌ ఇప్పటికీ అలాగే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఏసియాన్‌ సమావేశంలో ట్రంప్‌ గందరగోళం సృష్టించారు. ఏసియాన్‌ ఆదేశాల ఐక్యత చాటుతూ ప్రతిసారీ అన్ని దేశాల అధ్యక్షులు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని అభివాదం చేస్తుంటారు. ప్రతి ఒక్కరు తనకు ఇరువైపులా ఉన్న దేశాధ్యక్షుల చేతులను క్రాస్‌గా పట్టుకోవాల్సి ఉంటుంది. అందరూ అలాగే చేస్తుంటే మధ్యలో ఉన్న ట్రంప్‌ మాత్రం తనకు కుడివైపు ఉన్న వియత్నాం అధ్యక్షుడు గుయెన్‌ జువాన్‌కే రెండు చేతులతో హ్యాండ్‌ ఇచ్చి, తన ఎడమవైపు ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు డ్యుటెర్టిని వదిలేశారు. ట్రంప్‌ చేయి కోసం అలా చూస్తుండిపోయారు డ్యుటెర్టి, కొద్ది క్షణాల తర్వాత అసలు విసయం తెలుసుకొని, ఓ విచిత్రమైన హావభావంతో డ్యుటెర్టితో చేయి కలిపారు ట్రంప్‌. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రంప్‌ తీరుపై జోకులు వేసుకుంట్నారు. ఆసియా పర్యటనలో భాగంగా జపాన్‌, సౌత్‌ కొరియా, చైనా, వియత్నం పర్యటనల్లో ఉన్న ట్రంప్‌, ఎక్కడా ప్రొటోకాల్స్‌ను కూడా సరిగా పాటించలేదు.