చిన్నారులకు ఎపి జన్మభూమి కానుక

చిన్నారులకు ఎపి జన్మభూమి కానుక

13-11-2017

చిన్నారులకు ఎపి జన్మభూమి కానుక

26 ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతుల ఏర్పాటు

ఉత్తర అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఎపి జన్మభూమి ద్వారా ఎన్నారైల సహకారంతో ఇప్పటివరకు వేల సంఖ్యలో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 14వ తేదీ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో 26 ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు జయరామ్‌ కోమటి ప్రకటించారు. గుంటూరు జిల్లాలో 6 ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రకాశం జిల్లాలో 8 స్కూళ్ళలో, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 స్కూళ్ళలో, కృష్ణా జిల్లాలో ఒక స్కూల్‌లో ఈ డిజటల్‌ తరగతులను ఏర్పాటు చేశారు. ఎన్నారైల సహకారంతో ఈ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.

భీమినేని వీరభద్రరావు, కిలారు వెంకట పద్మజ, మధురావెల, ముక్కు వెంకట్రామిరెడ్డి, ఎం. మల్లిఖార్జునరావు, హరి గక్కాని, రజనీకాంత్‌ కాకరాల, క్రిష్టిపాటి పోలిరెడ్డి, మునగాల శ్రీనివాసరావు, అశోక్‌బాబు కొల్లా, సుమన్‌ చల్లగుంట, సందీప్‌ ఎక్కాల, కృష్ణారావు కోరపాటి, హిమబిందు దట్ల, రవి లగడపాటి, వినీల గంగ, సతీష్‌ మేక, రవీంద్ర చిత్తూరి, శిరీష నల్లమోతు ఈ డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు విరాళం ఇచ్చారు.