అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా

అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా

14-11-2017

అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెట్టింపయ్యింది. 2016తో పోల్చుకుంటే ఈ ఏడాది 12.3 శాతం పెరిగింది. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం వచ్చాక భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లి చదువుకోవాలంటేనే భయపడ్డారు. కానీ ఈ ఏడాది వారి సంఖ్య రెట్టింపవడం గమనార్హం. అమెరికాలో విద్యభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనా మొదటిస్థానంలో ఉండగా భారత్‌ రెండోస్థానంలో ఉంది. 2016-17 విద్యా సంవత్సరంలో అమెరికాలో 186,267 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు ఐఐఈ (ఇన్‌స్యిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌) నివేదిక వెల్లడించింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో 17.3 శాతం మన భారతీయ విద్యార్థులే కావడం విశేషం. చెనాలో 350,755 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది అక్కడి భారతీయుల సంక్‌య 6.8 శాతం పెరిగింది.

అమెరికాలో విదేశీ విద్యార్థుల సంఖ్య మూడు శాతం పెరిగితే, విదేశాల్లో అమెరికన్‌ విద్యార్థుల సంఖ్య నాలుగు శాతానికి పెరిగింది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులో చైనా, భారత్‌, దక్షిణ కొరియ, సౌదీ అరేబియా, కెనడా, వియత్నాం, తెవాన్‌, జపాన్‌, మెక్సికో, బ్రెజిల్‌ దేశాలకు చెందినవారున్నారు. ఈ విదేశీ విద్యార్థులంతా ఎక్కువగా అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, మస్సాచుసెట్స్‌, ఇల్లినాయిస్‌, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఒహాయో, మిచిగన్‌, ఇండియానా రాష్ట్రాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఈ రాష్ట్రాలోనే ఎక్కువగా విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అదే విధంగా అమెరికాకి చెందిన విద్యార్థులు ఎక్కువగా యూకే, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో చదువుకుంటున్నారు. మరో విషయమేంటంటే అమెరికాలో మన విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే భారత్‌లో అమెరికన్‌ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. 2016తో పోలిస్తే, ఈ ఏడాది 4,438 నుంచి 4,181కి తగ్గిపోవడం గమనార్హం.