టీవీ వీక్షణ తో రక్తం గడ్డకట్టే ముప్పు

టీవీ వీక్షణ తో రక్తం గడ్డకట్టే ముప్పు

14-11-2017

టీవీ వీక్షణ తో రక్తం గడ్డకట్టే ముప్పు

గంటల తరబడి టీవీ చూస్తున్న వారి శరీర భాగాల్లో రక్తం గడ్డకట్టే ముప్పు(వీటీఈ) రెండింతలవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ  సమయంపాటు కదలకుండా టీవీ చూస్తూ ఉండేవారి రక్తం గడ్డ కట్టే ముప్పు 1.8 శాతం పెరుగుతుందని అమెరికాలోని వెర్మాంట్‌ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాల టీవీ వీక్షణతో గుండె  సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ఇదివరకే ఓ పరిశోధన తెలిపింది. గంటలపాటు టీవీ చూడాలనుకునేవారు టీవీ ముందు ఓ థ్రెడ్‌మిల్‌  లేదా స్టేషనరీ బైక్‌ పెట్టుకుని వ్యాయామం చేస్తూ చూడండని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.