బిల్‌గేట్స్‌ భూరి విరాళం
Sailaja Reddy Alluddu

బిల్‌గేట్స్‌ భూరి విరాళం

14-11-2017

బిల్‌గేట్స్‌ భూరి విరాళం

అల్జీమర్స్‌ వ్యాధిపై పరిశోధనలకు 5 కోట్ల డాలర్ల (సుమారు రూ.335 కోట్లు) విరాళాన్ని ఇవ్వబోతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ప్రకటించారు. తనకు చెందిన బిల్‌గేట్స్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ నుంచి కాకుండా సొంత నిధులు దీనికి  కేటాయిస్తున్నట్లు బ్లాగు ద్వారా తెలిపారు. జీవిత చరమాంకంలో చుట్టుముట్టే వ్యాధుల్లో అతిపెద్ద ముప్పుగా అల్జీమర్స్‌ నిలుస్తోందనీ, దీనికి కారణాలను అన్వేషించి, నివారణ చర్యలు చేపట్టడానికి శాస్త్రవేత్తలు ఇంకా కృషి చేయాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న డెమెన్షియా డిస్కవరీ ఫండ్‌కు తాను విరాళాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. ఆల్జీమర్స్‌ నివారణకూ త్వరలోనే ఔషధం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.