తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఒహాయో ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవాలు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఒహాయో ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవాలు

17-11-2017

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఒహాయో ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవాలు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఒహాయో(టీఏసీవో) ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవాలు (నవంబర్‌ 11న) ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు మ‌న్నే నేతృత్వంలో ఒహాయోలోని డుబ్లిన్‌ కాఫ్‌మేన్‌ హైస్కూల్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో పాటు టాలీవుడ్‌/బాలీవుడ్‌ పాటలకు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమానికి డుబ్లిన్‌ మేయర్‌ గ్రెగ్‌ పీటర్సన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను టీఏసీవో బృందం సన్మానించింది. కార్యక్రమ నిర్వహణ పట్ల పీటర్సన్‌ సంతోషం వ్యక్తంచేశారు.

ఈ ఉత్సవాల్లో టాలీవుడ్‌ నటి రెజీనా, యాంకర్‌ లాస్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనదైన శైలిలో కార్యక్రమంలో ఆద్యంతం లాస్య నవ్వులు పూయించగా.. తన ఆట పాటలతో రెజీనా అలరించారు. సుమారు 400 మంది వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. 1250 మంది తెలుగువారు ఈ వేడుకలకు హాజరయ్యారు

కార్యక్రమంలో టీఏసీవో అధ్యక్షుడు నాగేశ్వరరావు మ‌న్నే, ఉపాధ్యక్షుడు రవి వంగూరి, సంఘం సభ్యులు జ్యోతి పూదోట, జగన్నాథ్‌ చలసాని, ప్రసాద్‌ కంద్రు, శ్రీకాంత్‌ మునగాల, వేణు బత్తుల, నరేశ్‌కుమార్‌ గందం, ప్రతిమ సూరవరపు, షిర్డీ గోమతి, విజయ్‌ కాకరాల, వెంకట్‌ కనక, సుబ్రహ్మణ్యం కాశీచైనుల, వినోద్‌ కోసికె, హనుమాన్‌ కనపర్తి, శ్రీనివాస్‌ పోలిన, మహేంద్రనాథ్‌ వన్నె, లత సాదినేని, హారిక కొమ్మూరి తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery