ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మానుషి చిల్లర్

ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మానుషి చిల్లర్

19-11-2017

ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మానుషి చిల్లర్

17 ఏళ్ల తర్వాత హర్యానాకు చెందిన మానుషి చిల్లార్‌కు మిస్‌వరల్డ్ కిరీటం దక్కింది. 2017 ఫెమినా మిస్ ఇండియా విజేతగా మానుషి చిల్లార్‌ టాప్‌ వన్‌లో నిలిచింది. 2000 సంవత్సరంలో భారత్‌ తరుపున ప్రియాకం చోప్రా మిస్‌వరల్డ్ కిరీటం పొందింది. అంతకుముందు 2000 సంవ త్సరంలో ప్రియాంకా చోప్రా ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు. వివిధ దేశాలకు చెందిన దాదాపు 108 మంది యువతులు ఈ పోటీలో పాల్గొన్నారు. వీరందరి మధ్య చిల్లార్‌ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సాన్య సిటి అరేనాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును బహూకరించారు. 2016 మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన ప్యూర్టెరికోకు చెందిన స్టెఫాని డెల్‌ వాల్లే ఆమెకు ప్రపంచ సుందరి కిరీటాన్ని ధరింప చేశారు. ఆమె ఈ ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా అవార్డును గెలుచుకున్నారు.

Click here for Event Gallery