శిఖరాగ్ర సదస్సులో కలుద్దాం : ఇవాంకా
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

శిఖరాగ్ర సదస్సులో కలుద్దాం : ఇవాంకా

21-11-2017

శిఖరాగ్ర సదస్సులో కలుద్దాం : ఇవాంకా

ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు అయిన ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్‌ ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు. అమెరికాలోని కొత్త పారిశ్రామికవేత్తల్లో 40శాతం మంది మహిళలేనని, 1986 తర్వాత వారి శాతం పెరగడం ఇదే ప్రథమమని అన్నారు. సోమవారం మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవమని, వారు పరిశ్రమలను నడపడానికి అవసరమైన మూలధనం, మార్గదర్శనం, వ్యవస్థలపై భరోసా కల్పించడమే తమ సంక్పలమని చెప్పారు. ఈ పారిశ్రామికవేత్తలందరినీ భారత్‌లో జరిగే శిఖరాగ్ర సదస్సులో స్వయంగా కలుస్తానన్నారు. ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ వంటి సాంకేతికతలను అందిపుచ్చుకుని, భవిష్యత్తు ఆర్థిక వ్వవస్థకు వారే నాయకత్వం వహించాలని సందేశమిచ్చారు.