భండారి ఎన్నిక మనకు గర్వకారణం

భండారి ఎన్నిక మనకు గర్వకారణం

21-11-2017

భండారి ఎన్నిక మనకు గర్వకారణం

అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)కు మరోసారి న్యాయమూర్తిగా ఎన్నికైన జస్టిస్‌ దల్వీర్‌ భండారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. దౌత్యపరంగా ఇదో మైలురాయి లాంటిది అని రాష్ట్రపతి ప్రశంసించగా, భండారి ఎన్నిక దేశానికి గర్వకారణమని ప్రధాని కొనియాడారు. అంతేగాక, భండారి విజయం వెనుక విశేష కృషి చేసిన కేంద్ర విదేశాంగశాఖ, ఐరాసలోని భారత ప్రతినిధుల బృందాన్ని ప్రధాని మోడీ అభినందించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలి సభ్యులు భారత్‌పై నమ్మకం ఉంచి భండారికి మద్దతివ్వడం ఆనందంగా ఉందన్నారు.