భారతీయులంతా గర్వించే సంఘటన

భారతీయులంతా గర్వించే సంఘటన

21-11-2017

భారతీయులంతా గర్వించే సంఘటన

భారతీయులంతా గర్వించే సంఘటన ఐక్యరాజ్య సమితిలో జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) న్యాయమూర్తిగా భారతదేశ అభ్యర్థి జస్టిస్‌ దల్వీర్‌ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. బ్రిటన్‌ అభ్యర్థి క్రిస్టఫర్‌ గ్రీన్‌వుడ్‌ పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో 2018-2027 పదవీ కాలానికి జస్టిస్‌ భండారీ ఎన్నికయ్యారు. బ్రిటన్‌ అభ్యర్థి గ్రీన్‌వుడ్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, చైనా మద్దతు పలికినట్లు కనిపించాయి. బ్రిటన్‌ కూడా శాశ్వత సభ్య దేశమే.