దల్వీర్ కు అమెరికా అభినందనలు

దల్వీర్ కు అమెరికా అభినందనలు

22-11-2017

దల్వీర్ కు అమెరికా అభినందనలు

ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (ఐసిజె) న్యాయమూర్తిగా ఎన్నికైన జస్టిస్‌ దల్వీర్‌ భండారీకి అమెరికా అభినందనలు తెలిపింది. అయితే ప్రస్తుత వీటో స్వరూపంలో ఎలాంటి మార్పులను అంగీకరించేది లేదని సృష్టం చేసింది. యుఎస్‌ భద్రతా మండలిలో స్వల్ప విస్తరణకు అమెరికా అనుకూలంగా ఉన్నప్పటికీ, వీటోను విస్తరించడానికి మాత్రం సుముఖంగా లేదు. భారతదేశానికి చెందిన జస్టిస్‌ దల్వీర్‌ భండారీ ఐసిజెకు జరిగిన ఎన్నికలో విజయం సాధించారు. భండారీపై పోటీ చేసిన బ్రిటన్‌కు చెందిన జడ్జి క్రిస్టోఫర్‌ గ్రీన్‌వుడ్‌ పోటీనుంచి విరమించుకోవడంతో భండారీ ఎన్నిక సాధ్యమైంది.