ఇవాంక మన కారెక్కరు...

ఇవాంక మన కారెక్కరు...

23-11-2017

ఇవాంక మన కారెక్కరు...

ఇవాంక ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు మాత్రమే కాదు ఆయన ముద్దుల కుమార్తె కూడా. అందుకే ఇంచుమించు ప్రపంచంలోని అన్ని ఉగ్రవాద సంస్థల నుంచీ ఆమెకు ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా సిరియాలోని ఐసిస్‌ ఉగ్రవాదులు, సానుభూతిపరులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ రానున్న ఇవాంకకు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా ఆమె భద్రత అంతా అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులే పర్వవేక్షిస్తున్నారు. ఇవాంక పర్యటన కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా మూడు వాహనాలను తెప్పిస్తున్నారు.

జనరల్‌ మోటర్స్‌ సంస్థ అమెరికా అధ్యక్షుడి కుటుంబం కోసం ప్రత్యేకంగా తయారు చేసే లీమోజీన్‌ వాహనాలు త్వరలో హైదరాబాద్‌ రానున్నాయి. మందుపాతరలు, తుపాకీ తూటాల నుంచి మాత్రమే కాదు రాకెట్‌ లాంచర్లు, జీవ, రసాయన దాడుల నుంచీ రక్షించగలిగేలా అన్ని రకాల సదుపాయాలు ఈ వాహనంలో ఉంటాయి. అధునాతన సమాచార వ్యవస్థతో చిన్నపాటి కార్యాలయంలా ఉంటుంది. ఇటువంటి వాహనాలు మూడింటిని తెప్పిస్తున్న అమెరికా అధికారులు ఇవాంక హైదరాబాద్‌లో పాల్గొనే అన్ని కార్యక్రమాలకూ వీటినే వాడబోతున్నారు.

ఇవాంకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు దేశంలోని ముంబయి, ఢిల్లీ, చెన్నై అమెరికా రాయబార కార్యాలయాలు నుంచి 100 మంది ఉద్యోగులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ బృందంలో 20 మందికిపైగా వంటవాళ్లూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందులో తప్ప మిగతా కార్యక్రమాల్లో ఇవాంక వీరు తయారు చేసే ఆహారమే తీసుకుంటారు. అమె మెనూ ఇప్పటికే హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి చేరింది. వంటదినుసులు కూడా అమెరికా ఉంచే దిగుతమి చేసుకుంటున్నారు.