ఇవాంకకు హైదరాబాద్‌లో మోదీ డిన్నర్‌

ఇవాంకకు హైదరాబాద్‌లో మోదీ డిన్నర్‌

23-11-2017

ఇవాంకకు హైదరాబాద్‌లో మోదీ డిన్నర్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకకు ప్రధాని మోదీ నిజాం వంటకాలను రుచి చూపించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్‌ టేబుల్‌ (101 మంది కూర్చునే) ఉన్న హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమాలో ఇవాంకా ట్రంప్‌కు మోదీ విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28వ తేదీన రాత్రి ఇవాంక తన బృందంతో కలిసి ఈ విందులో పాల్గొననున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఆ మరుసటి రోజు 29వ తేదీన గోల్కొండ కోటలో జీఈఎస్‌ సదస్సులో పాల్గొనే ప్రతినిధుల కోసం విందు ఏర్పాటు చేసింది.