వీటో మార్పులకు వ్యతిరేకం

వీటో మార్పులకు వ్యతిరేకం

23-11-2017

వీటో మార్పులకు వ్యతిరేకం

ఐక్యరాజ్యసమితి (ఐరాస)లోని భద్రతా మండలి శాశ్వత సభ్యులకు మాత్రమే పరిమితమైన వీటో అధికారంలో మార్పులు చేయడం లేదా సభ్యుల సంఖ్యను మార్చడాన్ని శాశ్వత సభ్య దేశమైన అమెరికా వ్యతిరేకిస్తోంది. అయితే భద్రతా మండలిలోని తాత్కాలికమైన 15 మంది సభ్యుల సంఖ్యను పెంచేందుకు మాత్రం మద్దతు పలికినట్లు ఐరాసలో ఉన్నతాధికారి వెల్లడించారు. 21వ శతాబ్దపు వాస్తవికతకు అద్దం పట్టేలా, ఈ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేలా భద్రతా మండలిలో సంస్కరణలు ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరించారు. ఐరాసలో సంస్కరణలకు అమెరికా కట్టుబడి ఉందని, అంతేకాకుండా భద్రతా మండలి విస్తరణకు కూడా మద్దతు పలుకుతున్నట్లు వెల్లడించారు. అయితే వీటో అధికారంలో మార్పులు కానీ పెంపును కానీ అమెరికా వ్యతిరేకిస్తోందన్నారు.