అమెరికా ఫస్ట్‌తో సమస్యలేదు..

అమెరికా ఫస్ట్‌తో సమస్యలేదు..

24-11-2017

అమెరికా ఫస్ట్‌తో సమస్యలేదు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించిన అమెరికా ఫస్ట్‌ విధానం, మోదీ ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా విధానం మధ్య సంఘర్షణ ఏమీ లేదని అమెరికా అధికారవర్గాలు అంటున్నాయి. చాలా దేశాలు తమ దేశంలోని ప్రజలకే మొదటి ప్రాధాన్యం ఇస్తుంటాయని, ఇలాంటి తరుణంలో బాహ్య ప్రపంచంతో వారికి సంబంధం ఉండదని చెప్పలేమని చెబుతున్నారు. అమెరికా, భారత్‌ మధ్య సంబంధాలు ఎంత బలోపేతంగా ఉన్నాయో ఇంతకు ముందే ట్రంప్‌ ప్రకటించారని ఒక అధికారి పేర్కొన్నారు. అమెరికా, భారత్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 11400 కోట్ల డాలర్లకు చేరుకుందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4,000 కోట్ల డాలర్లుగా ఉన్నాయని చెప్పారు.