ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారు

ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారు

24-11-2017

ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. నవంబర్‌ 28న తెల్లవారుజామున 3:30కి అమె శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకోనుంది. ఆమె వెంట ప్రైవేట్‌ కమర్షియల్‌ ఫ్లైట్‌లో వందమంది ప్రతినిధులు రానున్నారు. శంషాబాద్‌ నుంచి మాదాపూర్‌ లోని వెస్టిన్‌ హోటల్‌కు చేరుకుని అక్కడ బస చేయనున్నారు. ఉదయం 9:30కి హెచ్‌ఐసీసీలో ప్రతినిధులతో సమావేశం కానున్న ఇవాంక, సాయంత్రం 4:30కి ప్రధాని మోడీతో కలిసి గ్లోబల్‌ సమ్మిట్‌ లో పాల్గొననున్నారు. అనంతరం మోడీతో కలిసి సాయంత్రం 6:30కి ఫలక్‌ నుమా ప్యాలెస్‌ లో డిన్నర్‌ లో పాల్గొంటారు. డిన్నర్‌ అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి వెస్టిన్‌ హోటల్‌ కు వస్తారు. మరుసటి రోజు 29వ తేదీ ఉదయం 9:30కి హెచ్‌ఐసీసీ గ్లోబల్‌ సమ్మిట్‌ లో పాల్గొంటారు. ఆ తర్వాత మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం గోల్కొండను సందర్శించనున్న ఇవాంక, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు వెస్టిన్‌ హోటల్‌ కు చేరుకుని రాత్రి 9:30కి శంషాబాద్‌ నుంచి ఫ్లైట్‌లో అమెరికాకు తిరుగు పయనమవుతారు.