ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల

27-11-2017

ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌లో జరగనున్న జీఈఎస్‌ సదస్సుకు అమెరికా ప్రభుత్వ సలహాదారు హోదాలో ఆదేశ అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్‌ హాజరవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఇవాంక పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్‌ ఖరారైంది. షెడ్యూల్‌ ప్రకారం రేపు తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఇవాంక హైదరాబాద్‌ చేరుకుంటారు. అటునుంచి తాను బసచేయనున్న హోటల్‌ వెస్టిన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆమె అక్కడే ఉంటారు. ఆ తరువాత 3 గంటలకు హెచ్‌ఐసిసి చేరుకుంటారు. 3 నుంచి 4:25 గంటల వరకు జీఈఎస్‌ సదస్సులో పాల్గొంటారు. 4:25కి ప్రధాని మోడీతో భేటీ అవుతారు. 5:50కి తిరిగి హోటల్‌ వెస్టిన్‌ని చేరుకుంటారు. ఆ తరువాత రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. రాత్రి 10:40కి తిరిగి వెస్టిన్‌ హోటల్‌కు చేరుకుంటారు. 29వ తేదీన కూడా ఆమె నగరంలో ఉంటారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు హెచ్‌ఐసిసికి చేరుకుని జీఈఎస్‌ సదస్సులో పాల్గొంటారు. తిరిగి 11 గంటలకు వెస్టిన్‌ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 వరకు అక్కడే ఉండి అటునుంచి అమెరికాకు తిరుగుపయనమవుతారు.