హెచ్‌-1బీ వీసాపై గుడ్‌న్యూస్‌

హెచ్‌-1బీ వీసాపై గుడ్‌న్యూస్‌

02-12-2017

హెచ్‌-1బీ వీసాపై గుడ్‌న్యూస్‌

హెచ్‌-1బీ వీసాపై కఠినతరమైన నిబంధనలు తీసుకురాబోతున్నారంటూ తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తిన క్రమంలో అమెరికా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతమున్న హెచ్‌-1బీ వీసా విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని అమెరికా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ముందస్తు ఉన్న విధానమే కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ ఆసియాకు చెందిన డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ థామస్ వాజ్డ ఈ విషయాన్ని తెలిపారు. ''అమెరికాలోని హెచ్‌-1బీ వీసా విధానపు చట్టంలో ఎలాంటి మార్పు లేదు. హెచ్‌-1బీ వీసా విధానాన్ని సమీక్షించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చట్టంలో చాలా మార్పులు తీసుకురావాలని అనుకున్నారు. చాలా కేసుల్లో మార్పులు తీసుకురావాల్సినవసరం కూడా ఉంది. కానీ హెచ్‌-1బీల్లో మార్పుల కొరకు ఇప్పటివరకు ఎలాంటి చట్టాన్ని తీసుకురాలేదు. గతంలో ఉన్నదే కొనసాగుతోంది'' అని వాజ్డ అన్నారు.