తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి - నాయని పిలుపు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి - నాయని పిలుపు

03-12-2017

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి - నాయని పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర హోం శాఖా మంత్రి నాయనినరసింహరెడ్డి తెలిపారు. తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం ఆస్ట్రేలియా లో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు, గ్లోబల్ టెక్నాలజీ, ఆపిల్, గూగుల్ లాంటి సంస్థలను హైదరాబాద్కు టీ ఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చామని గుర్తుచేశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కొత్త టెక్నాలజీలను అమలు పర్చడంలో ముందుందని తెలిపారు.

రాష్ట్రంలో పరిశ్రమల కోసం నిపుణులైన మానవ వనరులు, అంతరాయం లేని విద్యుత్తు, నీటి సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానమన్, ప్రపంచ దేశాల ఇండస్ట్రియల్ పాలసీలను అధ్యయనం చేసి టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చామని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు, కొత్తగా 500 పరిశ్రమలకు భూకేటాయింపులు చేశామని ప్రకటించారు. తొలిదశలో 8,200 ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. కాకతీయ ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్ టైల్ పార్కు, సిరిసిల్ల అప్పారెల్ పార్కు తో పాటు నిజామాబాద్, గద్వాల, ఖమ్మం, సంగారెడ్డిలో మెగా ఫుడ్పార్క్లు ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు.

తెలంగాణ  రాష్ట్ర పోలీసు శాఖకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా చర్యలు తీసుకొంటున్నట్లు రాష్ట్ర హోం శాఖా మంత్రి శ్రీ నాయనినరసింహ రెడ్డి వెల్లడించారు, శాంతిభద్రతల్లో నూతన సాంకేతిక విధానాన్ని అమలుచేస్తుండటం, షీ టీమ్స్తో మహిళలకు భరోసా ఇవ్వడం , అత్యున్నత సాంకేతిక పరికరాలతో సిబ్బంది విధులు నిర్వహించేందుకు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ నుండి భారీ ఎత్తున పోలీస్ శాఖకు నిధులు కేటాయించడం, ఆధునిక పద్ధతుల ద్వారా నేర నిర్ధారణ, సాక్ష్యాల సేకరణ, నేరం జరగ కుండా వివిధ శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం, మూడేండ్లలో నూతన వాహనాలు, కొత్త భవనాలు, అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం లాంటి చర్యలతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రతి పోలీసు స్టేషన్కు నూతన వాహనాలను అందచేశామన్నారు. ఫ్రెండ్లీ పోలీసులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ శాఖ ప్రస్తుతం 70 శాతం సఫలమైందని ఆస్ట్రేలియా లో నివసిస్తున్న వాయపారవేతలను హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు,.

పారిశ్రామిక ప్రగతికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని, ఈ దృష్ట్యా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ తోటి సభ్యులను ప్రోత్సహించాలని తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం (టీబీసీఫ్) ప్రతినిధులకు హెచ్ఎంసీ  స్టాండింగ్ కమిటీ సభ్యుడు - v శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు, హైదరాబాద్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు, తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. దేశ, విదేశాల పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని అన్ని రాష్ర్టాల కన్నా ముందుంది. ఇతర రాష్ర్టాలు తెలంగాణ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేవు.

టీఆర్ఎస్ నగరప్రధాన కార్యదర్శి - శ్రీ. మహమ్మద్. అజమ్ అలీ గారు తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల గురించి రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుసుకొంటున్నారని అన్నారు.

తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం ఆస్ట్రేలియా అధ్యక్షులు అశోక్ మరం, సందీప్ మునగాల , నల్లా ప్రవీణ్ రెడ్డి, కపిల్ కాట్పెల్లీ, తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery