పొలిటికో పవర్‌ జాబితాలో పరిమళా జయపాల్‌

పొలిటికో పవర్‌ జాబితాలో పరిమళా జయపాల్‌

06-12-2017

పొలిటికో పవర్‌ జాబితాలో పరిమళా జయపాల్‌

2018 సంవత్సరపు పొలిటికో పవర్‌ మేగజైన్‌ జాబితాలో భారతీయ సంతతికి చెందిన అమెరిన్‌ కాంగ్రెస్‌ ఉమెన్‌ పరిమళా జయపాల్‌(52) చోటు సంపాదించారు. ప్రతిఘటించే తత్వమున్న ఆమె సభా బాధ్యతలు తీసుకున్న పనితీరును మేగజైన్‌ గుర్తించింది. 18 మంది పొలిటికో పవర్‌ జాబితాలో ఆమె 5వ వ్యక్తిగా నిలిచారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను విమర్శించడంలో, వేగంగా ఎదుగుతున్న డెమోక్రటిక్‌ తారగా ఆమె గుర్తింపు పొందారు. ఆమె ప్రతిఘటన నాయకత్వం అసామాన్యం. కాంగ్రెషనల్‌ ప్రొగ్రెసివ్‌ కాకస్‌ ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె క్యాపిటల్‌ హిల్‌ వలసదారుల సంస్కరణలు, పౌర హక్కుల గురించి నిరంతంరం వాదించారు అని ఆమె స్నేహితురాలు, రిపబ్లికన్‌ పార్టీ సభ్యురాలు రో ఖన్నా చెప్పారు.

పరిమళా జయపాల్‌ ఎన్నడూ సవాళ్ల నుంచి తప్పుకోలేదని పొలిటికో పవర్‌ మేగజైన్‌ అభిప్రాయ పడింది. అమెరికా శాసన సభలో డెమోక్రటిక్‌ కాకస్‌లో ఆమె భవిష్యత్తులో గురుతర బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆమె మార్గ నిర్దేశకురాలు. కృతనిశ్చయంతో దూసుకెళుతుంది అని డెమోక్రసీ ఫర్‌ అమెరికా కు చెందిన రాబర్ట్‌ క్రూక్షాంక్‌ పేర్కొన్నారు. ఆయన జయపాల్‌ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే.