భారతీయ అమెరికన్‌కు మరో అరుదైన గౌరవం

భారతీయ అమెరికన్‌కు మరో అరుదైన గౌరవం

06-12-2017

భారతీయ అమెరికన్‌కు మరో అరుదైన గౌరవం

భారతీయ మూలాలున్న కాలిఫోర్నియా సెనేటర్‌ కమలాహ్యారిస్‌కు మరో గౌరవం దక్కింది. పారిన్‌ పాలసీ మ్యాగజైన్‌ రూపొందించిన లీడింగ్‌ గ్లోబల్‌ థింకర్స్‌ 2017 జాబితాలో ఆమెకు ప్రథమ స్థానం దక్కింది. అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్‌గా కమల ఇప్పటికే రికార్డు సృష్టించారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రాసిక్యూటర్‌గా సాధించిన విజయాలు, సెనేటర్‌గా ఎన్నికైన తర్వాత తొలి ఏడాదికాలంలో సామాజిక న్యాయం కోసం ఆమె సాగించిన కృషిని మ్యాగజైన్‌ ప్రశంసించింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచారు. భారతీయ సంతతికి చెందిన 32 ఏండ్ల ప్రసిద్ధ కమెడియన్‌ హసన్‌ మిన్హాజ్‌కు మూడోస్థానం దక్కటం విశేషం. ఇండో అమెరికన్‌ సంతతికే చెందిన ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీకి ఈ జాబితాలో చోటు లభించింది.