ఇక పూర్తిస్థాయిలో ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌

ఇక పూర్తిస్థాయిలో ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌

06-12-2017

ఇక పూర్తిస్థాయిలో ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టులో పెద్ద విజయం దక్కింది. తుదితీర్పు వెలువడేలోగా, ఆరు ముస్లిం మెజార్టీ దేశాలపై ట్రంప్‌ జారీచేసిన ప్రయాణ నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. 7-2 మెజార్టీతో న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణ నిషేధంపై దిగువ కోర్టులు లోగడ విధించిన ఆంక్షలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. తన నిర్ణయానికి కారణాలను కోర్టు వెల్లడించలేదు. అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వులపై దిగువ కోర్టు తన సమీక్షను వేగంగా పూర్తిచేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. సుప్రీం కోర్టు నిర్ణయంతో అమెరికాతో సరైన సంబంధం లేకుండా ఇరాన్‌, లిబియా, సిరియా, యెమెన్‌, సోమాలియా, చాద్‌ దేశాల ప్రజలు ఈ దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ఆంక్షలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. సుప్రీంకోర్టు నిర్ణయం తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి హోగన్‌ గిడ్లీ పేర్కొన్నారు.