అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు

అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు

11-12-2017

అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు

అమెరికాలో షికాగోలో ఉన్నతవిద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అక్బర్‌ (30) కొందరు గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుడి దవడలోంచి ఓ తూటా దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు. కాల్పులు  సమాచారం అందుకున్న పోలీసులు అక్బర్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. షికాగోలోని డివ్రై యూనివర్సిటీలో మాస్టర్‌ ఇన్‌ కంప్యూటర్‌ సిస్టమ్స్‌ నెట్‌వర్కింగ్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ చదివేందుకు మూడేళ్ల కిందట అమెరికా వెళ్లిన అక్బర్‌ మరో మూడు నెలల్లో కోర్సు పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. ఈ నెల 5న అక్బర్‌ తన కారును పార్కింగ్‌ చేస్తుండగా అతనిపై కాల్పులు జరిగాయి. షికాగోలోనే ఉంటున్న అక్బర్‌ స్నేహితుడు, హైదరాబాద్‌కు చెందిన అశ్వక్‌కు పోలీసులు ఈ సమాచారం అందించగా అతను ఈ విషయాన్ని అక్బర్‌ తల్లిదండ్రులకు 6న తెలియజేశాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తమ కుమారుడిని చూసేందుకు వెంటనే అమెరికా వీసా ఇప్పించాలంటూ అక్బర్‌ తండ్రి యూసఫ్‌ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి కన్నీళ్ల పర్వంతమయ్యారు.