న్యూయార్క్‌లో బాంబు పేలుడు
Sailaja Reddy Alluddu

న్యూయార్క్‌లో బాంబు పేలుడు

12-12-2017

న్యూయార్క్‌లో బాంబు పేలుడు

అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో బాంబు పేలుడు సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ సమీపంలోని పోర్ట్‌ అథారిటీ బస్‌ టెర్నినల్‌ వద్ద బాంబు పేలింది. అమెరికాలో అతిపెద్ద బస్సు టర్మినల్‌ ఇదే. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ శబ్దంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పేలుడు అనంతరం వ్యక్తి గాయాలతో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూడగా అతని పొట్టభాగంలో వైప్‌ బాంబు అమర్చిబడి ఉంది. బాంబు స్వ్కాడ్‌ సాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు.