శాన్‌ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేశ్‌ పర్యటన

శాన్‌ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేశ్‌ పర్యటన

15-12-2017

శాన్‌ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేశ్‌ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆలోక్‌ సేతి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జొయ్‌ బోయిరియోని లోకేష్‌ కలిశారు. త్వరలో విశాఖపట్టణంలో ఏర్పాటు చేసే ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ డవలప్‌మెంట్‌ సెంటర్‌పై వీరి మధ్య చర్చ జరిగింది. విశాఖలో ఏర్పాటు చేయబోయే ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిని కేటాయిస్తామని మంత్రి లోకేశ్‌ వివరించారు.

Click here for Photogallery