మెలానియా న్యూఇయర్‌ డ్రెస్‌ అస్సలు బాలేదట!

మెలానియా న్యూఇయర్‌ డ్రెస్‌ అస్సలు బాలేదట!

02-01-2018

మెలానియా న్యూఇయర్‌ డ్రెస్‌ అస్సలు బాలేదట!

అమెరికా ఫస్ట్‌లేడీ మెలానియా ట్రంప్‌ మరోసారి నెటిజన్ల దృష్టిలో పడ్డారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆమె ధరించిన డ్రెస్‌ ఈసారి నెటిజన్ల విమర్శలకు కారణమైంది. పామ్‌బీచ్‌లోని మార్‌ ఎ లాగోలో జరిగిన న్యూఇయర్‌ పార్టీకి మెలానియా లేత గులాబి రంగు గౌను ధరించి హాజరయ్యారు. ఆ డ్రెస్‌ ఖరీదు 4వేల డాలర్లు. అయితే ఈ డ్రెస్‌ నెటిజన్లకు పెద్దగా నచ్చినట్లు లేదు. దీనికంటే గతేడాది డ్రెస్సే బావుందని, స్లీవ్స్‌ నెక్‌లైన్‌ అస్సలు బాగోలేవని, అసలు ఈ డ్రెస్‌లో ఎవరు బాగుంటారో తెలియదు అంటూ రకరకాలుగా ట్వీట్లు చేశారు. మెలానియా ఈ డ్రెస్‌లో అస్సలు బాలేదని, మెలానియా వైట్‌హౌస్‌కు వెళ్లిన తర్వాత ఆమె ఫ్యాషన్‌ సెన్స్‌ 99శాతం పడిపోయిందంటూ కొందరు నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ఈ పార్టీకి ట్రంప్‌, మెలానియాల కుమారుడు బారన్‌, అలాగే ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌, ఆమె భర్త కుష్నర్‌, వారి పిల్లలు అరాబెల్లా, జోసెఫ్‌లు కూడా హాజరయ్యారు.