'కూర్చోవడం' రోగాలకు చెక్‌ పెట్టే పరికరం

'కూర్చోవడం' రోగాలకు చెక్‌ పెట్టే పరికరం

03-01-2018

'కూర్చోవడం' రోగాలకు చెక్‌ పెట్టే పరికరం

గంటల తరబడి కూర్చొని పనిచేస్తే ఆయుక్షీణంతో పాటు కేన్సర్‌, మధుమేహం లాంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అప్పుడప్పుడు నిల్చుంటూ ఉండాలి. కానీ, తప్పనిసరిగా కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందికర పరిస్థితిని గమనించిన అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ శాస్త్రవేత్తలు, కూర్చుని పనిచేసుకుంటూ ఉండగానే కాళ్లను నిరంతరం కదిలించే సరికొత్త పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరాన్ని కాళ్ల వద్ద అమర్చుకుంటే, అది కంపనాలను సృష్టించి కాళ్లు ఊగేట్లు చేస్తుందని, తద్వారా జీవక్రియ రేటు మెరుగవుతుందని, రోగాలు దరి చేరవని పరిశోధకులు తెలిపారు.