మే 4 నుంచి 10 వరకు చంద్రబాబు అమెరికా పర్యటన
APEDB

మే 4 నుంచి 10 వరకు చంద్రబాబు అమెరికా పర్యటన

12-04-2017

మే  4 నుంచి 10 వరకు చంద్రబాబు అమెరికా పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 4 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నట్లు తెలిసింది. కాలిఫోర్నియాలో యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ ఐబీసీ) అవార్డు స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఈ పర్యటన సమయంలోనే రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడులను రప్పించేందుకోసం అక్కడి ఎన్నారైలతోనూ, ఇతర ప్రముఖులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకుసంబంధించి పర్యటన షెడ్యూల్‌ను ఎపి ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ పర్యవేక్షిస్తోంది.

వారం రోజుల షెడ్యూల్‌ లో మూడు భారీ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. కాలిఫోర్నియా బే ఏరియాలో మే 6న, డల్లాస్‌ లో మే 7న, న్యూజెర్సీ లో పదో తేదీన ఈ సమావేశాలు జరగనున్నాయి.  మే 8న చంద్రబాబు యుఎస్‌ ఐబీసి అవార్డు స్వీకరించనున్నారు. అనంతరం జరిగే సమావేశాల్లో సిలికాన్‌ వ్యాలీ సీఈవోలతో, పారిశ్రామికవేత్తలతోనూ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు.

ఈ పర్యటనకు సంబంధించి ఎపి ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌  సిఇఓ కృష్ణ?కిషోర్‌ జాస్తి ఇప్పటికే పలువురు ఎన్నారైలతో సమావేశమయ్యారు.