కాలిఫోర్నియాలో భారీ వర్షాలు

కాలిఫోర్నియాలో భారీ వర్షాలు

10-01-2018

కాలిఫోర్నియాలో భారీ వర్షాలు

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ కాలిఫోర్నియాలో మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. గాయపడ్డ మరో 163 మందిని హాస్పటల్‌కు తరలించారు. శాంటా బార్బరాలోని రోమిరో ప్రాంతంలో సుమారు 300 మంది చిక్కుకున్నారు. మట్టిచరియలు విరిగిపడ్డ ప్రాంతం అంతా యుద్ధ వాతవరణాన్ని తలపిస్తున్నది పోలీసులు అన్నారు. ఇదే ప్రాంతంలో నెల రోజుల క్రితం దావానలం వచ్చింది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వేలాది మంది ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.