హెచ్‌-1బీ నిర్ణయంపై ఎన్‌ఆర్‌ఐల హర్షం

హెచ్‌-1బీ నిర్ణయంపై ఎన్‌ఆర్‌ఐల హర్షం

11-01-2018

హెచ్‌-1బీ నిర్ణయంపై ఎన్‌ఆర్‌ఐల హర్షం

హెచ్‌-1బీ వీసాల పొడిగింపును అడ్డుకోబోమని ట్రంప్‌ పాలనా యంత్రాంగం చేసిన ప్రకటనకు ఇండియన్‌ అమెరికన్లు హర్షం ప్రకటించారు. ఆ వినాశకర యోచనను విరమించకపోతే దేశం నుంచి మేథావుల వలసలు పెరిగి అమెరికా వ్యాపారం దెబ్బతినేదని అన్నారు. ఇండియన్‌ -అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కిష్ట్రమూర్తి వలస సర్వీసుల అధికార్లు చేసిన తాజా ప్రకటనను ప్రశంసించారు. దేశీయ కార్మికుల నైపుణ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూనే హెచ్‌- 1బీ వీసా పొడిగింపును అనుమతించాలని ఆయన సూచించారు. అలాకాకుండా వారిని స్వదేశాలకు తిప్పిపంపితే అమెరికా వ్యాపార రంగానికి అపార నష్టం కలిగేదని ఆయన అన్నారు. హిందూ, అమెరికన్‌ ఫౌండేషన్‌ (హెచ్‌ఎఎస్‌) ఇడి సుహాగ్‌ శుక్లా కూడా అదే తీరుగా స్పందించారు. హెచ్‌-1బీ వీసాల పద్దతి మార్పు లేకుండా యథావిధిగా కొనసాగుతుందన్న ప్రకటనను ప్రజాప్రతినిధుల సభ సభ్యులు కూడా ప్రశంసించారు. తుల్సీ గిబ్బార్డ్‌, కెవిన్‌ యోధర్‌ ఆ మేరకు ప్రకటనలు చేశారు.