బఫెట్‌ వారసుడు భారతీయుడు?

బఫెట్‌ వారసుడు భారతీయుడు?

11-01-2018

బఫెట్‌ వారసుడు భారతీయుడు?

బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ చైర్మన్‌గా వారన్‌ బఫెట్‌ తర్వాత అజిత్‌ జైన్‌ అనే భారతీయుడిని నియమించే అవకాశం కనిపిస్తోంది. ఈ కంపెనీ ద్వారా స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తూ బఫెట్‌ ఇబ్బడిముబ్బడిగా సంపాదించారు. ఫోర్బ్స్‌ పత్రిక నివేదిక ప్రకారం బఫెట్‌ ప్రస్తుతం ప్రపంచంలోని ముగ్గురు అత్యంత ధనవంతుల్లో ఒకరు. ప్రస్తుతం బర్క్‌షైర్‌ కంపెనీలోనే పనిచేస్తున్న అజిత్‌ జైన్‌(65)తోపాటు గ్రెగోరి ఎబెల్‌(55)ను కూడా కంపెనీ వైస్‌ చైర్మన్‌గా ప్రమోట్‌ చేయడంతో వీరిద్దరిలో ఒకరు బఫెట్‌ వారసుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.