భారతీయులకు శుభవార్త..

భారతీయులకు శుభవార్త..

11-01-2018

భారతీయులకు శుభవార్త..

అమెరికాలో ఉన్న ఇండియన్‌ టెకీలకు ఇది గుడ్‌న్యూస్‌. గ్రీన్‌కార్డుల సంఖ్యను ఏడాదికి 45 శాతం మేర పెంచే బిల్లును యూఎస్‌ హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ప్రవేశపెట్టారు. ఇది చట్టంగా మారితే ఇండియన్‌ టెకీలకు పండుగే. నైపుణ్య ఆధారిత వలస విధానం, గ్రీన్‌కార్డుల పెంపునకు సంబంధించి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సెక్యూరింగ్‌ అమెరికాస్‌ ప్యూచర్‌ యాక్ట్‌ పేరుతో ట్రంప్‌ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇది చట్టమైతే గకన, ప్రస్తుతం ఏడాదికి లక్షా 20వేలుగా ఉన్న గ్రీన్‌కార్డుల సంఖ్య లక్షా 75 వేలకు చేరునుంది. ఇది హెచ్‌-1బీ వీసాలపై వెళ్లే ఇండియన్‌ టెకీలకు శుభవార్తే. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకునే అవకాశం ఈ గ్రీన్‌కార్డుల ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్న భారతీయల సంఖ్య 5 లక్షల వరకు ఉంది. వీళ్లంతా ఏడాది చొప్పున హెచ్‌-1బీ వీసాల గడువును పొడిగించుకుంటూ వెళ్తున్నారు. కొందరైతే దశాబ్దాలుగా గ్రీన్‌కార్డుల కోసం చూస్తేనే ఉన్నారు. హెచ్‌-1బీ వీసాల ద్వారా తాత్కాలికంగా విదేశీ నిపుణులను తీసుకునే అవకాశం అమెరికా కంపెనీలకు ఉంటుంది. ఇప్పుడు గ్రీన్‌కార్డుల సంఖ్య పెరిగేతే ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. అయితే ఇదే చట్టంలో చెయిన్‌ మైగ్రేషన్‌ను రద్దు చేసే క్లాజ్‌ కూడా ఉంది. అంటే కేవలం జీవిత భాగస్వాములు, మైనర్‌ పిల్లలకు తప్ప మిగతా బంధువులు ఎవరికీ గ్రీన్‌కార్డులు ఇచ్చే అవకాశం ఉండకపోవడం ఇండియ్‌ అమెరికన్లకు కస్తా ఆందోళన కలిగించే విషయం.