అమెరికా అధ్యక్ష బరిలో ఓప్రా విన్‌ఫ్రే!

అమెరికా అధ్యక్ష బరిలో ఓప్రా విన్‌ఫ్రే!

12-01-2018

అమెరికా అధ్యక్ష బరిలో ఓప్రా విన్‌ఫ్రే!

మీడియా అధిపతి, టాక్‌ షో నిర్వాహకురాలు, నటి, నిర్మాత, దాత ఓప్రా విన్‌ఫ్రే 2020లో జరుగనునన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తున్నది. డెమోక్రటిక్‌ పార్టీ తరపున ఆమె బరిలోకి దిగవచ్చని విన్‌ఫ్రేకు సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు ఇటీవల వెల్లడించారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ఆమె అంతరంగికులు కూడా ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇంతవరకు ఓప్రా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలుస్తున్నది. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీపడే వారి విరాలు అధికారికంగా ఈ ఏడాది మధ్యలో వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే పలువురు ఆశావహులు ఐయోవాలోని పార్టీ కార్యాలయానికి చక్కర్లు కొడుతున్నారు. గత వారం జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల కార్యక్రమంలో ఓప్రా విన్‌ఫ్రే చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగం నేపథ్యంలో ఆమె 2020 అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ ప్రసంగంలో ఆమె కనుచూపు మేరలో మీకు మంచి రోజులు రానున్నాయి అంటూ చేసిన వ్యాఖ్య, ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారనడానికి సంకేతమని పలువురు అభిప్రాయపడుతున్నారు.