మళ్లీ పారిస్ ఒప్పందంలోకి అమెరికా?

మళ్లీ పారిస్ ఒప్పందంలోకి అమెరికా?

12-01-2018

మళ్లీ పారిస్ ఒప్పందంలోకి అమెరికా?

తమకు ఆమోదయోగ్యమైన విధంగా పారిస్‌ పర్యావరణ ఒప్పందం లో మార్పులు జరిగితే అందులో తిరిగి చేరడంపై యోచిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. నిజాయితీగా చెబుతున్నా. పారిస్‌ ఒప్పందంతో నాకెలాంటి సమస్య లేదు. కానీ అమెరికా ప్రయోజనాలు దెబ్బతీసేలా నాటి ఒబామా సర్కారు సంతకం చేయడం ఆందోళనకు గురిచేసింది. ఇది అమెరికాకు ఒక చెత్త డీల్‌. ఒప్పందంలో మాకు అనుకూలంగా మార్పులు జరిగితే తిరిగి అందులో చేరొచ్చు. పర్యావరణ కాలుష్యంపై నేనూ ఆందోళన చెందుతున్నా. స్వచ్ఛ జలం, స్వచ్ఛ గాలితో పాటు ఇతర దేశాలతో పోటీపడుతూ వ్యాపారాలు చేయడం ముఖ్యమే. కానీ పారిస్‌ ఒప్పందం మా పోటీతత్వ ప్రయోజనాన్ని హరిస్తోంది అని అన్నారు.