టెక్సాస్ ఎన్నికల బరిలో భారతీయుడు

టెక్సాస్ ఎన్నికల బరిలో భారతీయుడు

13-01-2018

టెక్సాస్ ఎన్నికల బరిలో భారతీయుడు

2018 అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. భారత సంతతికి చెందిన అమెరికా వాసి టెక్సాస్‌లో తన నామినేషన్‌ దాఖలు చేశారు. 39 ఏళ్ల ప్రిస్టన్‌ కుల్‌కర్నీ డెమోక్రటిక్‌ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఓల్సన్‌ ఉన్నారు. 22వ జిల్లా నుండి శ్రీ పోటీ చేయనుండగా, దీని పరిధిలో ఆగ్నేయ టెక్సాస్‌లో పలు ప్రాంతాలతో పాటు షుగర్‌ల్యాండ్‌, మిస్సోరీ సిటీ, డీర్‌ పార్క్‌, పీర్లాండ్‌, గాల్వేస్టన్‌ ఉంటాయి. శ్రీ హౌస్ట్‌న్‌లో నివాసం ఉంటారు. అతని తండ్రి వెంకటేశ్‌ కుల్‌కర్ణి ప్రముఖ నవలా రచయిత. వెంకటేశ్‌, అమెరికాకు చెందిన మార్గరెట్‌ను వివాహం చేసుకున్నారు. 1980లో ఈ దంపతులు హోస్టన్‌కు వెళ్లి స్థిరపడ్డారు. మార్గరెట్‌ ఎగ్జాన్‌లోని ఆయిల్‌ కంపెనీలో ఉద్యోగిని. వెంకటేశ్‌ రైస్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తారు. టెక్సాస్‌ యూనివర్సిటీ నుండి ప్లాన్‌-2 హానర్స్‌ ప్రోగ్రామ్స్‌లో శ్రీపట్టా సాధించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి కోలిన్‌ పావెల్‌ వద్ద ఫారెన్‌ సర్వీస్‌ అధికారిగా పని చేశారు. 14 ఏళ్ల పాటు ఇరాక్‌, ఇజ్రాయెల్‌, రష్యా తైవాన్‌, జమైకాలో శ్రీ విధులు నిర్వహించారు.