సైకిల్ తొక్కటం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువ

సైకిల్ తొక్కటం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువ

13-01-2018

సైకిల్ తొక్కటం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువ

సైకిల్‌ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది. సైకిల్‌ తొక్కటం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయని శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు తేల్చారు. స్విమ్మింగ్‌, రన్నింగ్‌ చేసే వారితో పోలిస్తే సైక్లింగ్‌ చేసేవారికి లైంగిక పటుత్వం ఎక్కువగా ఉంటున్నట్లు తేలిందని వీరు చెబుతున్నారు. సైక్లింగ్‌తో  కార్డియోవాస్యులర్‌ లాభాలతోపాటు కీళ్ల సమస్యలు కూడా తగ్గుతాయన్నారు. సైక్లిస్ట్‌లతో బరువు సంబంధ సమస్యల కూడా చాలా వరకు దూరమైనట్లు పరిశోధనకుల్లో ఒకరైన ప్రొఫెసర్‌ బెంజమిన్‌ బ్రేయర్‌ వివరించారు. అధ్యయనంలో భాగంగా 2,774 మంది సైక్లిస్టులు, 539 మంది స్విమ్మర్లు, 789 మంది రన్నర్స్‌ను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు.