మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్

మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్

13-01-2018

మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్

అమెరికాకు వలస వచ్చిన నిపుణులను అవమానించే రీతిలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. చెత్త దేశాల నుంచి వచ్చే వారందరూ (వలసవాదులు) మనకెందుకు? అని ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. చట్టసభ సభ్యులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో నాలుగు గోడల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వీసాల లాటరీని సగానికి పరిమితం చేయాలని, మిగిలిన మేర తగిన ప్రాతినిధ్యం లేని ఆఫ్రికా దేశాలకు కేటాయించాలని లిండ్స్‌ గ్రాహమ్‌ ఓ ప్రణాళిను ట్రంప్‌కు నివేదించారు. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ హైతి, ఇతర ఆఫ్రికా దేశాల నుంచే వచ్చే వారు మనకు ఎందుకు? నార్వే వంటి దేశాల నుంచి అమెరికా ఎక్కువ మందిని ఆకర్షించాలి అని అన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఓ వ్యక్తి మీడియాకు ఉప్పందించడంతో విషయం వెలుగు చూసింది.