లాస్ఏంజెల్స్ కు 28న వస్తున్న నారా లోకేష్

లాస్ఏంజెల్స్ కు 28న వస్తున్న నారా లోకేష్

20-01-2018

లాస్ఏంజెల్స్ కు 28న వస్తున్న నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పంచాయతీ, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటనలో భాగంగా జనవరి 28న లాస్‌ ఏంజెల్స్‌కు వస్తున్నట్లు ఎన్నారై టీడిపి నాయకులు పేర్కొన్నారు. లోకేష్‌ రాకను పురస్కరించుకుని మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. సెరిటోస్‌ సెంటర్‌ ఫర్‌ ది ఫర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌లో జరిగే మీట్‌ అండ్‌ గ్రీట్‌కు అందరూ హాజరుకావాలని వారు కోరారు. ఎన్నారై ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలపై, అమరావతి రాజధాని అభివృద్ధి, ఇతర విషయాలపై ఇందులో చర్చించడం జరుగుతుందని కూడా వారు పేర్కొన్నారు.