ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధం

ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధం

30-01-2018

ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధం

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌ ప్రముఖ పారిశ్రామిక వేత్తలను కలుస్తూ బిజి బిజీగా ఉన్నారు. మంగళవారం కలర్ టోకెన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాజాంచిని కలిశారు. ఆ సంస్థ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, డేటాబేస్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్నది. టెక్నాలజీ అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేస్తున్నామని మంత్రి రాజేష్ కాజాంచికి వివరించారు. లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన రాజేష్ ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి అధ్యయనం చేస్తామని రాజేష్ కాజాంచి స్పష్టం చేశారు. 

తర్వాత క్లౌడ్ లెండింగ్ సొల్యూషన్స్ ప్రతినిధి స్నేహల్‌తో మంత్రి నారా లోకేష్‌ సమావేశం అయ్యారు. భారత్‌లో కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్నామని స్నేహల్‌ అన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఏపీ ప్రభుత్వంతో పనిచేయడానికి సిద్ధమని, ఏపీలో పాలసీలు, రాయితీలపై అధ్యయనం చేసి, కంపెనీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని స్నేహల్ మంత్రి లోకేష్‌తో అన్నారు