గూగుల్ టీమ్ తో లోకేష్ భేటీ

గూగుల్ టీమ్ తో లోకేష్ భేటీ

03-02-2018

గూగుల్ టీమ్ తో లోకేష్ భేటీ

అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్‌ టీం అంజలీ జోషి, సూర్యనారాయణ కొదుకుళ్ల, డేవిడ్‌ షాపిరోలతో లోకేశ్‌ భేటీ అయ్యారు. జి స్టేషన్‌, క్రోమ్‌ బుక్స్‌, టెలి మెడిసిన్‌లో ఫైబర్‌గ్రిడ్‌తో కలిసి పనిచేసేందుకు త్వరలోనే ఒప్పందం చేసుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని వారు తెలిపారు. తాగునీటి నాణ్యత, వ్యవసాయ రంగాల్లో ఐవోటి వినియోగంపై రూపొందించిన పరికరాలను అక్కడ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని.. ఏపీలో కంపెనీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని ఆర్మ్‌ కంపెనీ సీఈవో సైమెన్‌ తెలిపారు. చిప్‌ డిజైనింగ్‌లో శిక్షణ, సెమికండక్టర్స్‌ పార్కు ఏర్పాటుకు సహకారం అందిస్తామని గ్లోబల్‌ ఫౌండరీస్‌ సీఈవో సంజయ్‌ జాహ్‌ హామీ ఇచ్చారు.