మీకు బాలయ్య...నాకు ముద్దుల మావయ్య

మీకు బాలయ్య...నాకు ముద్దుల మావయ్య

05-02-2018

మీకు బాలయ్య...నాకు ముద్దుల మావయ్య

న్యూజెర్సీలో ఏపీ ఎన్నారైలతో జరిగిన సమావేశంలో మంత్రి లోకేష్‌  లోకేశ్‌ ప్రసంగిస్తూ ఉండగా కొంతమంది బాలకృష్ణకు మద్దతుగా నినాదాలు చేశారు. సభా ప్రాంగణమంతా బాలయ్య.. బాలయ్య అంటూ నినాదాలతో మారుమ్రోగిపోయింది.  ఓ సందర్భంలో వారిని కట్టడి చేయడానికి లోకేశ్‌, బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు. సింహం గురించి తాను ఏం చెబుతానని అంటూ, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లెజెండ్‌, సింహా లాంటి సినిమాల్లో బాలయ్య అదుÄతేంగా నటించారని కితాబిచ్చారు. బాలయ్యపై లోకేశ్‌ పొగడ్తల వర్షం కురిపిస్తుంటే ఎన్నారైలు హర్షద్వానాలు పలికారు. ఎన్నారైలను ఉద్దేశించి ''మీ అందరికీ ఆయన బాలయ్య.. నాకు మాత్రమే ముద్దుల మావయ్య'' అంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో కార్యక్రమ ప్రాంగణమంతా నవ్వులతో నిండిపోయింది.