ఫార్మా కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ...

ఫార్మా కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ...

05-02-2018

ఫార్మా కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ...

అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సి వచ్చినప్పుడు పలు ఫార్మా కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో లోకేశ్‌ సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులను వారికి తెలియజేశారు. ఐటీ రంగం అభివ ద్ధికి అమలు చేస్తున్న పద్ధతిలోనే ఫార్మా రంగాన్ని కూడా అభివ ద్ధి చేస్తామని లోకేశ్‌ వివరించారు. ఫార్ములేషన్‌, పరిశోధన, అభివ ద్ధి నైపుణ్య శిక్షణ కోసం ఇంక్యుబేటరీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బల్క్‌ డ్రగ్‌ అభివ ద్ధి కోసం విశాఖపట్నంలో ఫార్మాపార్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మౌలికవసతులు, ఇంక్యుబేటరీ, ఫార్మాపార్క్‌ ఏర్పాటుచేస్తే రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని ఫార్మా కంపెనీల ప్రతినిధులు చెప్పారు. పూర్తిస్థాయి ప్రణాళికలతో మీ ముందుకు వస్తామని లోకేశ్‌తో పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు తెలిపారు.