బోస్టన్ లో లోకేష్ బిజీ

బోస్టన్ లో లోకేష్ బిజీ

05-02-2018

బోస్టన్ లో లోకేష్ బిజీ

అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్‌లో నారా లోకేష్‌ పర్యటించినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సిఇఓలతో, ఎన్నారై టీడిపి అభిమానులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఐటీరంగం అభివృద్ధికి చేస్తున్న కృషిని ఆయన వారికి వివరించారు. రాష్ట్రంలో ఉన్న అపారమైన మానవ వనరులను ఉపయోగించుకోవాలని, కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని ఆయన ఎన్నారైలను కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మలచడంలో ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు.

తానా ఫౌండేషన్‌ ట్రస్టీ శశికాంత్‌ వల్లేపల్లి ఈ సమావేశ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. ఆయనతోపాటు తానా మాజీ అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌, అనిల్‌ లింగమనేని, మురళీ వెన్నం, సాంబ దొడ్డ, దినేష్‌ త్రిపురనేని, జనార్థన్‌, ప్రవీణ్‌ కొడాలి, అనిల్‌, రాజా నల్లూరి, రఘు కొర్రపాటి, సుధాకర్‌ కొర్రపాటి తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. డల్లాస్‌, కెనడా, న్యూజెర్సి, చికాగో, అల్బనీ నుంచి వచ్చిన ఎన్నారై టీడిపి అభిమానులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click here for Event Gallery