చిన్నారి లేఖకు చలించిన ట్రంప్

చిన్నారి లేఖకు చలించిన ట్రంప్

06-02-2018

చిన్నారి లేఖకు చలించిన ట్రంప్

తుపాకీ కాల్పుల్లో ప్రాణ స్నేహితుణ్ణి కోల్పోయిన ఓ చిన్నారి, పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నిస్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఉత్తరం రాసింది. దీనికి ట్రంప్‌ చలించిపోయి ఆ చిన్నారికి సమాధానం పంపించారు. సౌత్‌ కరొలినాలోని టౌన్‌విల్లే పట్టణంలో ఎవా ఓస్లేన్‌ అనే చిన్నారి, ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడం చూసింది. ఆమె చదువుకునే పాఠశాల వద్ద 14 ఏళ్ల అబ్బాయి జరిపిన కాల్పుల్లో ఎవా స్నేహితుడు జాకో బ్‌ సహా ముగ్గురు మృతి చెందారు. పాఠశాల ఆటస్థలం లో ఆడుకుంటున్న జాక్‌బో తీవ్రంగా గాయపడి మూడు రోజుల అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన 2016 సెప్టెంబర్‌లో జరిగింది.

స్నేహితుడి మరణాన్ని మర్చిపోలేని ఎవా 2017 ఆగస్టులో అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాసింది. డియర్‌ మిస్టర్‌ ప్రెసిడెంట్‌, నా పేరు ఎవా రోస్‌ ఓస్లేన్‌. నాకు ఏడేళ్లు. రెండు తరగతి చదువుతున్నాను. గత ఏడాది టౌన్‌విల్లే ఎలిమెంటరీ స్కూల్‌ దగ్గర జరిగిన కాల్పుల్లో నా స్నేహితుడు జాకోబ్‌ ప్రాణాలు కోల్పోయాడు. అది చూసి నేను చాలా భయపడ్డాను. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. దయచేసి ఇలాంటిది ఎప్పటికి జరగనివ్వకండి అంటూ లేఖలో పేర్కొంది. ట్రంప్‌ సమాధానం పంపించారు. డియర్‌ ఎవా, నీ స్నేహితుడు జాకోబ్‌ మరణం గురించి విని నేను, మిసెస్‌ ట్రంప్‌ చాలా బాధపడుతున్నాం. నీ గురించి, నీ కుటుంబం గురించి, జాకోబ్‌ కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం అని ట్రంప్‌ చెప్పారు.